పిల్లలకు మాస్క్ వద్దు.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే

by Shamantha N |   ( Updated:2021-06-10 09:20:07.0  )
Central Government has issued guidelines for corona control in children
X

న్యూఢిల్లీ: పిల్లల్లో కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బారినపడ్డ పిల్లలకు రెమ్‌డెసివిర్ ఇవ్వరాదని, విచ్చలవిడిగా చెస్ట్ ఇమేజింగ్ హెచ్‌ఆర్‌సీటీ చేయరాదని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఐదేళ్లలోపు పిల్లలు మాస్క్ ధరించరాదని, 6ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు చిన్నారుల వారి వారి సామర్థ్యాలను బట్టి తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో మాస్క్ ధరించవచ్చునని తెలిపింది.

12ఏళ్లు పైబడిన పిల్లలూ వయోజనుల తరహాలోనే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. మాస్కు ముట్టుకున్నప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. 12ఏళ్లు పైబడిన పిల్లలు చేతికి పల్స్ ఆక్సీమీటర్ పెట్టుకుని తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఆరు నిమిషాలు వారున్న గదిలోనే నడిపించాలని, తద్వారా వారి ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యాన్ని పరిశీలించవచ్చునని వివరించింది. జ్వరం, గొంతులో గరగరకు మైల్డ్ ఇన్ఫక్షన్ ఉన్నవారు ప్రతి 4-6 గంటలకు ఒక 10-15 ఎంజీల పారాసెటిమల్ వేసుకోవచ్చనని పేర్కొంది. మాడరేట్ ఇన్ఫెక్షన్‌కు ఆక్సిజన్ థెరపీని మొదలుపెట్టవచ్చు.

Advertisement

Next Story

Most Viewed