వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్టాగ్ గడువు పొడిగింపు

by Anukaran |
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్టాగ్ గడువు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఫాస్టాగ్ గడువును మరోసారి పొడిగించింది. గతంలో జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ఆ గడువును 2021 ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ ద్వారా 75-80 శాతం వరకు టోల్ ప్లాజా వద్ద చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా, టోల్ గేట్ల వద్ద క్యాష్‌లెస్ సేవలను పెంచాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story