- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మారనున్న బ్యాంకింగ్ వ్యవస్థ.. నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ముంబైలో బ్యాంకర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న దాని కంటే బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం, అప్డేట్ చేయాలని, వినియోగదారులకు సత్వర సేవలు అందించడానికి మరిన్ని మార్పులు చేయాలని తెలిపారు. అయితే, ఈశాన్య రాష్ట్రాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా దృష్టి సారించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు.
అంతేకాకుండా, ఈశాన్య రాష్ట్రాల వ్యాపారులకు అధికంగా రుణాలు ఇవ్వాలని సూచించారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ వాగ్దానం మేరకు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా కేంద్రం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అక్కడి ప్రజల జీవనాభివృద్ధి కోసం బ్యాంకులు తమ వంతు తోడ్పాటు అందించాలని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది.