రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపేశాం: కేంద్రం

by Harish |
రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపేశాం: కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తారంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేయడంతో.. వాటిని రద్దు చేస్తారనే వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రూ. 2 వేల నోట్ల ముద్రణపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2019 ఏప్రిల్ నుంచి రూ. 2 వేల నోట్లు ముద్రించడం లేదని పార్లమెంట్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు.

రిజర్వు బ్యాంకుతో చర్చించిన అనంతరం రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. రూ.2 వేల నోట్లను పెద్ద ఎత్తున దాచుకోవడంతో పాటు నల్లడబ్బు రూపేణా వివణీలో చలామణీ చేసే అవకాశముందని, అందుకే నోట్ల ముద్రణను ఆపేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed