రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే రూ.2 వేలు కట్

by Anukaran |   ( Updated:2021-12-19 06:29:49.0  )
రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే రూ.2 వేలు కట్
X

దిశ, వెబ్‌డెస్క్: పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. త్వరలోనే 10వ విడత నగదును జమ చేయనుంది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది.

పీఎం కిసాన్ లబ్ధిదారులు ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. ఈ-కేవైసి చేయకపోతే 10వ విడత రూ.2 వేల పీఎం కిసాన్ నగదు జమ కాదని స్పష్టం చేసింది. ఈ-కేవైసి ప్రక్రియలో భాగంగా రైతులు తమ ఆధార్ కార్డును పీఎం కిసాన్ ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లేదా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్(CSC) ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed