- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకా ధరలు తగ్గించాలని తయారీ సంస్థలను కోరిన కేంద్రం..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వినియోగంలో ఉన్న రెండు టీకాల ధరలను తగ్గించాలని వ్యాక్సిన్ తయారీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కోరింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నారు. ఈ నేపథ్యంలో టీకాల ధరలు తగ్గించాలని కేంద్రం కోరింది.
సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకా ధరను ఒక్కో డోసుకు కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన మరో వ్యాక్సిన్ కొవాగ్జిన్ ధరల్ని వరుసగా.. రూ.150, రూ.600, రూ.1200గా భారత్ బయోటెక్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒకే డోసుకు వివిధ ధరల్ని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే దేశం ఒకే ధర ఉండాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ధరల్ని తగ్గించాలని కేంద్రం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.