కేంద్రం ఇస్తానన్న బియ్యం ఎక్కడ ?: ఉత్తమ్

by vinod kumar |
కేంద్రం ఇస్తానన్న బియ్యం ఎక్కడ ?: ఉత్తమ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం పంపిణీ చేస్తామన్న బియ్యం ఇంకా తెలంగాణకు కాలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీ‌భవన్‌లో శానిటైజర్స్, మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కరోనా నియంత్రణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరిస్తుందన్నారు. ఉజ్వల స్వీమ్ కింద ఇస్తామన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఐదు కిలోల బియ్యం, రూ.500లను త్వరగా రాష్ట్రంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్‌పై కొంతమంది మతం రంగు రుద్ది ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. 87 లక్షల కుటుంబాల్లో 22 లక్షల మందికి మాత్రమే బియ్యం ఇవ్వడం జరిగిందన్నారు. 3లక్షల మంది వలస కార్మికులకు బియ్యం, రూ.500 పంపిణీ కేవలం 10శాతం మాత్రమే పూర్తయ్యిందన్నారు.

Tags: TPCC, Uttamkumar Reddy, Corona Virus, Gandhibahan, Ujwal Scheme, Gas, Rice Distribution,

Advertisement

Next Story

Most Viewed