- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ రుణాలపై కేంద్రం ఆంక్షలు.. సర్దుబాటుకు మూడేళ్లే..
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. రాబోయే మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకునే రుణాలపై ఆంక్షలు విధించింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటివరకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి రూ.17,924 కోట్ల రుణాలు తీసుకుందని కేంద్రం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. లోక్‌సభలో సోమవారం టీడీపీ ఎంపీ కేశినేని నాని, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వివరాలు అడిగారు.
దీనికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంబీ పరిధికి మించి రుణాలు తీసుకుందని తెలిపారు. అధికంగా తీసుకున్న రుణాలను మూడేళ్లలో సర్దుబాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశిలిచ్చారు. రాబోయే కాలంలో చేసే అప్పుల విషయంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటకుండా ఎట్టిపరిస్థితుల్లో చూసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది.