రాష్ట్రానికి 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్

by Shyam |
రాష్ట్రానికి 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి ఏడు ఏకలవ్య మోడల్ రెసిరెన్షియల్ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మహబూబాబాద్‌ జిల్లాకు 2, ఆదిలాబాద్ జిల్లాకు-1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 3, ఖమ్మం జిల్లాకు 1 మంజూరు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 23కు చేరింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ విద్యాలయాల కేంద్రంగా మారనుందని, కేసీఆర్ ఫలితంగానే ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు వచ్చాయని మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న గిరిజన ఆవాసాలు ఇంకా ఉన్నాయని, వాటిలో కూడా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed