ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు

by Shamantha N |
ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు
X

న్యూఢిల్లీ: రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతున్న వందల మంది ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆ ఖాతాలను బ్లాక్ చేయాలని, ఐటీచట్టం సెక్షన్ 69ఏ కింద జారీ చేసిన మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు మేరకు సోమవారం పదుల సంఖ్యలో ఖాతాలను బ్లాక్ చేసిన ట్విట్టర్ అర్ధరాత్రి తర్వాత వాటిని పునరుద్ధరించింది. ట్విట్టర్ అనేది ఓ సంస్థ మాత్రమేనని, అది చట్టాలను రూపొందించలేదని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని నోటీసులో పేర్కొంది. ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కింద రైతుల ఉద్యమానికి సంబంధించిన చేసిన 150 ట్వీట్లను తొలగించడంతోపాటు 100 ఖాతాలను బ్లాక్ చేయాలని సోమవారం ఉదయం ట్విట్టర్‌కు ఐటీశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఐటీ మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశం అనంతరం సోమవారం అర్ధరాత్రి ఆ ఖాతాలను అన్ బ్లాక్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed