లాక్‌డౌన్ వ్యూహం విఫలమైంది: రాహుల్ గాంధీ

by Shamantha N |   ( Updated:2020-05-26 03:21:01.0  )
లాక్‌డౌన్ వ్యూహం విఫలమైంది: రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదని, దాని లక్ష్యమే నీరుగారిపోయిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. లాక్‌డౌన్ వ్యూహమే విఫలమైందని అభిప్రాయపడ్డారు. ‘రెండు నెలల క్రితం 21 రోజుల్లో కొవిడ్ 19పై పోరాడి జయిస్తామని ప్రధాని అన్నాడు. కానీ, ఏమైంది? ఇప్పటికి లాక్‌డౌన్ విధించి 60 రోజులు దాటింది. ఒకవైపు కరోనా కేసులు వేగంగా పెరుగుతూ ఉంటే మరోవైపు లాక్‌డౌన్ ఎత్తేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. ఇలా కేసులు పెరుగుతున్నా.. లాక్‌డౌన్ ఎత్తేసేందుకు సిద్ధమవుతున్న ఏకైక దేశం మనదే కావొచ్చు. మనం నిర్దేశించుకున్న లక్ష్యం, ఆశించిన ప్రయోజనాలను లాక్‌డౌన్ అందించలేకపోయిందనే భావిస్తున్నాను. ఇక ఇప్పుడు పెరుగుతున్న కేసులను నిలువరించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రణాళిక ఏమిటి? రాష్ట్రాల దగ్గర వ్యూహాలున్నాయి. కానీ, కేంద్రం నుంచి ఆర్థికపరమైన మద్దతు అందడం లేదు. రాష్ట్రాలు కొవిడ్-19పై ఒంటరి పోరాటం చేస్తున్నాయి.’ అని ఆయన వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేనిది కరోనాపై పోరాటం రాష్ట్రాలకు క్లిష్టంగా మారుతున్నది. రైతులకు, కార్మికుల నేరుగా డబ్బు అందిస్తున్నారు. సరే.. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ పోరాటాన్ని చేయడానికి కేంద్రం నిధులు అందించాల్సిందే. నేరుగా ప్రజల్లోకి డబ్బును పంపించడమే కాదు.. కేంద్రం నుంచి తప్పకుండా ఆర్థిక సహకారం ఉండాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed