- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్మశాన వాటికలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి : ఎర్రబెల్లి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.1,554 కోట్ల వ్యయంతో 12,270 వైకుంఠధామల నిర్మాణాలు చేపట్టామని, ఇందులో 11,250 పూర్తి అయ్యాయని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇంకా 1,470 వివిధ దశలల్లో ఉన్నాయని, కరోనా దృష్ట్యా పూర్తి అయిన శ్మశానవాటికలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పలు ఆదేశాలిచ్చారు. గ్రామపంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 217 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిందని, ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనులు ఉధృతంగా జరుగుతున్నాయని, పని ప్రదేశాల్లో కూలీలకు కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎండ కాలంలో కూలీలు వడ దెబ్బ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య సర్వేలో ఆశ వర్కర్లతో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు సమన్యయంతో పని చేసి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం అయ్యేలా చూడాలని మంత్రి కోరారు.
కరోనా నివారణ చర్యలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయాలని, హరితహారం కింద నాటిన మొక్కలను ఎండిపోకుండా చూడాలని, నాటిన మొక్కల్లో 100 శాతం సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులదేనన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన పీఎంజీఎస్‌వై పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. గ్రామాల్లో కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని, పాజిటివ్ వచ్చిన వారికి ఇంట్లో హోం ఐసోలేషన్‌కు సమస్యలు ఉంటే ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని, దాతల సహకారంతో రోగులకు ఆహారం, పండ్లు, పాలు, ఇతర నిత్యావసరాలను అందించాలని కోరారు. కరోనా కారణంలో ప్రభుత్వ ఖజానాకు ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం లేదని మంత్రి దయాకర్‌రావు చెప్పారు.