'జనహితమే జనసేనాని లక్ష్యం'.. సెలబ్రిటీల విషెస్

by Jakkula Samataha |
జనహితమే జనసేనాని లక్ష్యం.. సెలబ్రిటీల విషెస్
X

దిశ, వెబ్ డెస్క్ : ‘పవర్ స్టార్ ఫొటో చూస్తే చాలు ఎక్కడలేని కిక్ వస్తుంది. ఒక్క క్లిపింగ్ చూస్తే చాలు ఆ పవర్ మనలో ఎంటర్ అయినట్లు ఉంటుంది. ఇక సినిమా చూస్తే ప్రపంచాన్నే జయించినంత హ్యాపీగా ఉంటుంది’ అని అభిమానులు చెప్పే మాట. మరి అలాంటి పవర్ స్టార్ రాజకీయాల్లోకి వస్తే.. అధికారం దక్కక పోయినా సరే, అదేమీ పట్టించుకోకుండా జనానికి సేవ చేయాలన్న లక్ష్యమే ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఓటు వేసి గెలిపించుకోలేని కష్టాల్లో నేనున్నానంటూ మరోవైపు జనానికి అండగా నిలుస్తున్నారు. మరి అలాంటి పవర్.. అలాంటి లీడర్.. అలాంటి హీరో పుట్టినరోజున సోషల్ మీడియా ఎలా ఉంటుంది.. అభిమానులు, సెలెబ్రిటీల ట్వీట్స్‌తో రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బెస్ట్ విషెస్ చెప్పిన తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు. అన్నదమ్ముల బంధం ఇలాగే ఉంటుంది అనేందుకు ఉదాహరణలా ఉంది చిరు విష్.

‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.. తన గుండెచప్పుడు ఎప్పుడూ జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్‌ను కౌగిలించుకుని ఉన్న పిక్ షేర్ చేశారు చిరు.

రామజోగయ్య శాస్త్రి కూడా తనదైన శైలిలో పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. సహనం, సేవానిరతి, సమాజం పట్ల ఆయనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

https://twitter.com/ramjowrites/status/1300965301857648640?s=19

‘మీరంటే.. ముక్కుసూటితనం, అడ్డంకుల్ని లెక్కచేయని గుణం, సహనం సేవానిరతి, సమాజంపట్ల అక్కర, మీ సంకల్పబలం కోట్లాది జీవితాల్ని ప్రభావితంచేసే వెయ్యి సూరీళ్ల వెలుగుగా ప్రకాశించాలని, పరమార్ధాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ’ పవన్ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకున్నారు.

పవర్ స్టార్ ఎంతో మందికి స్ఫూర్తిని అందించారన్నారు డైరెక్టర్ బాబీ. లక్షల్లో వేల మంది యాక్టర్‌గా మారాలని కలలు కంటారు.. కానీ మిలియన్‌లో ఒక్కడు మాత్రమే అలా కాగలడు. అలాంటి వారిలో కొందరు మాత్రమే సూపర్ స్టార్ కాగలరు. సినిమాలో అనూహ్యమైన శిఖరాలను అధిరోహించినా సరే.. మీరు ఇంకా మీ మనసునే అనుసరిస్తున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.

బండ్ల గణేష్ పవర్ స్టాన్‌ను దేవుడిగా కొలుస్తుంటారు. పవన్ వల్లే తనకు ఇంత గొప్ప జీవితం లభించిందని చెప్పే బండ్ల గణేష్.. పవన్‌ను ఈశ్వరునితో పోలుస్తూ విష్ చేశాడు. తనతో మరోసారి సినిమా చేయాలన్న ఆకాంక్షను కూడా వెల్లడిస్తూ ట్వీట్ చేశాడు.

‘ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం.. అందుకో జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తనదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్‌కు బెస్ట్ విషెస్ అందించారు. మీ దయ, వినయం ఎల్లపుడూ మార్పును ప్రేరేపిస్తాయి. ఇలాగే మీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని.. మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు.

https://twitter.com/urstrulyMahesh/status/1301025890558603264?s=19

పవన్ కళ్యాణ్ తనపై గొప్ప ప్రభావం చూపించారని తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆయన మాటలు తనను ప్రేరేపిస్తాయని.. ప్రోత్సహిస్తాయని, శక్తినిస్తాయని తెలిపిన చెర్రీ.. నాలోని బెస్ట్ వెర్షన్‌కు కారణం పవన్ కళ్యాణ్ అన్నారు. మా బాబాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విష్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed