నెలలు నిండకుండానే జన్మిస్తోన్న పిల్లలు.. ఇండియాలోనే అధికం

by Shyam |   ( Updated:2021-11-18 09:15:24.0  )
celebration, Kims Cuddles
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రతియేటా సుమారు కోటిన్నర మంది పిల్లలు నెలలు నిండకముందే పుడుతున్నారని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ఇలా జన్మించిన వారిలో వచ్చే అనారోగ్య సమస్యలతో ఏడాదికి 10 లక్షల మంది వరకు మరణిస్తున్నారని వెల్లడించారు. ఇతర దేశాల్లో ఇలా నెలలు నిండకముందే జననాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ప్రపంచం మొత్తం మీద నెలల నిండకముందు జననాల్లో అత్యధిక భాగం భారతదేశంలోనే ఉండటం చూస్తోంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం అవుతున్నాయన్నారు.

ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా కిమ్స్ కడిల్స్‌లో సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ హీరో శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. నెలలు నిండని మరణాలను నివారించి, అలాంటి పిల్లలను సంరక్షించి, 2025 నాటికి నెలలు నిండని పిల్లల తగ్గించాలన్న లక్ష్యం నెరవేర్చేందుకు ఐక్యరాజ్యసమితి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి సీఈవో డాక్టర్ అభినయ్, డాక్టర్ సుధీర్, మెడికల్ సూపరింటెండెంట్ భానుదీప్, పీడియాట్రిక్ న్యూరాలజిస్టు, వైద్యులు శ్రీరాం, అరవింద, శ్వేత పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed