కేసీఆర్‌కు బుద్ధి చెప్పారు.. వరంగల్‌లో బీజేపీ నేతల సంబురాలు

by Ramesh Goud |
కేసీఆర్‌కు బుద్ధి చెప్పారు.. వరంగల్‌లో బీజేపీ నేతల సంబురాలు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల‌ రాజేంద‌ర్‌ను గెలిపించి అహకారంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజ‌లు త‌గిన బుద్ధి చెప్పార‌ని బీజేపీ వ‌రంగ‌ల్ జిల్లా అధ్యక్షురాలు రావు ప‌ద్మ అన్నారు. హుజూరాబాద్ ప్రజ‌లు ఈట‌ల రాజేంద‌ర్‌కు స్పష్టమైన మెజార్టీని క‌ట్టబెట్టార‌ని గుర్తు చేశారు. మంగ‌ళ‌వారం హ‌నుమకొండ పార్టీ కార్యాల‌యంలో కార్యక‌ర్తల‌తో క‌లిసి విజ‌యోత్సవ సంబురాలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు హనుమకొండ హంటర్ రోడ్‌ మీద బాంబులు పేల్చి, స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం హనుమకొండ అదాలత్ సర్కిల్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సంబురాలలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రావు పద్మ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నాయ‌కులు చేసిన ఎలాంటి ప్రలోభాలకు ప్రజ‌లు త‌లొగ్గలేద‌ని అన్నారు. గ్యాస్ ధ‌ర పెంపుపై కేంద్రంపై నింద‌లు వేసిన మంత్రి హ‌రీష్‌రావు మాట‌లు ఒట్టి గ్యాసేన‌ని ప్రజ‌లు గ్రహించార‌ని అన్నారు. ఈ విజ‌య స్ఫూర్తితో భ‌విష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ప్రతి బీజేపీ కార్యక‌ర్త కృషి చేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Next Story