- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆర్థికలోటు 5 శాతానికి పైగా ఉండవచ్చు’
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికలోటు స్థూల జాతీయోత్పత్తి కన్నా 1.7 శాతం నుంచి 1.8 శాతం ఎక్కువగా ఉండొచ్చునని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో జీడీపీ తగ్గవచ్చునని పేర్కొన్నారు. జీడీపీ వద్ద స్థిరంగా ఉంటే పెరుగుదల సంవత్సరానికి జీడీపీలో 5.2 శాతం నుంచి 5.3 శాతంగా ఉంటుందన్నారు. ప్రకటించిన రుణాలు 50 శాతం అంతకుమించి పెరిగినందున, బడ్జెట్‌లో ఆర్థిక లోటు లక్ష్యంలో పెరుగుదల ఉంటుందని భావించవచ్చునన్నారు. కరోనా సంక్షోభం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం సవరించే అవకాశముందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.4.2 లక్షల కోట్ల స్థూల రుణాలు తీసుకోవాలని కేంద్రం భావించిందన్నారు. దీంతో రుణ అంచనాలు రూ .7.8 లక్షల కోట్ల బడ్జెట్ అంచనా నుంచి రూ .12 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. అంతకుముందు జీఎస్డీపీలో రుణాలు 3 శాతం నుంచి 5 శాతం వరకు తీసుకునేందుకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతించింది. తీసుకునే రుణాలు ఆదాయాల అంతరాన్ని తగ్గించడానికి ఉపయోగించనున్నట్లు పేర్కొంది. కరోనా సంక్షోభం వల్ల కేంద్రం, రాష్ట్రాల ఆదాయాలు క్షీణించాయని, పైగా ఖర్చులు పెరుగుతున్నాయని అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఆర్థిక సంకోచం భారీగా తగ్గుతుందని సుబ్రమణియమ్ తెలిపారు. లాక్ డౌన్ ప్రారంభంలో వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు, ప్రస్తుతం అంతకుమించి ఉంటాయని భావిస్తున్నట్లు వివరించారు.