- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడుల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం!
దిశ, వెబ్‌డెస్క్ : ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఐడీబీఐ బ్యాంకులో మేనేజ్‌మెంట్ కంట్రోల్ బాధ్యతలను బదిలీ చేయడంతో పాటు వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కేంద్రం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) సంబంధిత వాటా ఎంతవరకు కేటాయించాలనే దానిపై ఆర్‌బీఐతో సంప్రదించి లావాదేవీల సమయంలో నిర్ణయించబడుతుంది.
కేంద్రం ప్రభుత్వం, ఎల్ఐసీ కలిసి ఐడీబీఐ బ్యాంకులో 94 శాతానికి పైగా ఈక్విటీలను కలిగి ఉన్నాయి. ప్రభుత్వం వాటా 45.48 శాతం ఉండగా, ఎల్ఐసీ 49.4 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఎల్ఐసీ సంస్థ మేనేజ్‌మెంట్ కంట్రోల్ బాధ్యతలతో బ్యాంకు ప్రమోటర్‌గా ఉండగా, కేంద్ర ప్రభుత్వం కో-ప్రమోటర్‌గా ఉంది. మేనేజ్‌మెంట్ కంట్రోల్ బాధ్యతలను వదులుకోవాలనే ఉద్దేశ్యం, వ్యూహాత్మక వాటా అమ్మకాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో తన వాటాను తగ్గించడానికి ఎల్ఐసీ బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. ఐడీబీఐ బ్యాంక్ వాటా కొనుగోలుదారు దాని వ్యాపార సామర్థ్యాన్ని పెంచి, సరైన అభివృద్ధి కోసం నిధులను కేటాయించవచ్చు. కొత్త టెక్నాలజీ పరిజ్ఞానాన్ని, మెరుగైన నిర్వహణను కొనసాగించవచ్చని, కేంద్రం, ఎల్ఐసీలపై ఆధారపడకుండా బ్యాంకును అభివృద్ధి చేయవచ్చని ఎల్ఐసీ భావిస్తోంది.