- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CBSE పరీక్షల షెడ్యూల్ విడుదల..
దిశ, వెబ్‌డెస్క్ : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. మే 4 నుంచి జూన్ 11వరకు ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మే 4 నుంచి జూన్ 7వరకు జరిగే పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30వరకు కొనసాగనున్నాయి.అదేవిధంగా మే 4నుంచి జూన్ 11వరకు జరిగే 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 1.30వరకు.. రెండో షిప్టు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనుంది. మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు.. జులై 15 నాటికి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు గతంలోనే కేంద్ర మంత్రి ప్రకటించారు. కాగా, సీబీఎస్‌ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోమని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.