సుధాకర్ కేసులో కుట్ర ఉందన్న సీబీఐ

by Anukaran |   ( Updated:2020-09-01 05:03:06.0  )
సుధాకర్ కేసులో కుట్ర ఉందన్న సీబీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని, లోతుగా దర్యాప్తు చేయాలని సీబీఐ… హైకోర్టుకు తెలిపింది. దర్యాప్తునకు మరింత సమయం కావాలని కోర్టును సీబీఐ అభ్యర్థించగా.. న్యాయస్థానం రెండు నెలల సమయం ఇచ్చింది. తుది నివేదికను నవంబర్ 11న సమర్పించాలని ఆదేశించింది. నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్.. మాస్కులు, పీపీఈ కిట్లు లేవని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. కొద్దిరోజులు కనిపించకుండా పోయిన డాక్టర్ సుధాకర్.. మే 16న విశాఖలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో సుమోటోగా పిల్‌గా పరిగణించి కోర్టు విచారణ చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed