సీబీఐ చర్యలు సరైనవే..

by Ramesh Goud |
సీబీఐ చర్యలు సరైనవే..
X

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారిని సీబీఐ అరెస్టు చేయడం సరైనదేనని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విటర్ వేదికగా తెలిపారు. అంతేకాకుండా సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా అరెస్టయిన అధికారి గోపాల కృష్ణ మాధవ్ గతంలో సిసోడియా కార్యాలయంలో ఓఎస్డీగా విధులుగా నిర్వర్తించారు. పన్ను ఎగవేత కేసును సెటిల్ చేసేందుకు గోపాల కృష్ణ తన కార్యాలయంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం సీబీఐ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అయితే ఈ అరెస్టుపై స్పందించి సిసోడియా.. సీబీఐ చర్యను సమర్థించారు. ఈ సమయంలో అరెస్టు చేయడం పట్ల తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, లంచం తీసుకునేవారెవరినైనా వెంటనే అరెస్టు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇందులో సిసోడియా పాత్ర లేదని పీటీఐ వర్గాలు తెలియజేయగా.. బీజేపీ మాత్రం ఈ ఘటన ఆధారంగా ‘ఆప్’లో అందరూ దొంగలేనని, ‘పైకి మాత్రం కామన్ మ్యాన్’ లాగా వ్యవహరిస్తారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed