- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులు తీవ్రంగా నష్టపోతారు -సోమిరెడ్డి
దిశ, ఏపీ బ్యూరో : వ్యవసాయానికి ఉచిత కరెంట్ విషయంలో నగదు బదిలీ విధానం తగదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన విధానంలో జరిగే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు.
వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ వినియోగానికి మీటర్లు అంటే రైతుకు తీవ్ర అన్యాయమే జరుగుతుందన్నారు. ప్రస్తుతం జీతాలు, పింఛన్లు 1వ తేదీన చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వం రైతుకు నగదుసకాలంలో చెల్లించకపోతే తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని చెప్పారు. ఖాతాలో పడిన నగదును కొందరు రైతులు ఇతర అత్యవసరాలకు వాడుకోవాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో బ్యాంకర్లు బాకీ కింద జమ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.
సకాలంలో బిల్లులు చెల్లించక కనెక్షన్లు కట్ అయితే అంతిమంగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఎన్టీ రామారావు అప్పట్లోనే మీటర్ల విధానాన్ని తొలగించి శ్లాబ్ పద్ధతితో నామమాత్రపు చార్జీలు అందుబాటులోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు దాన్ని మరింత సరళతరం చేశాయన్నారు. మళ్లీ ఇప్పుడు మీటర్లంటే రైతుకు పూర్తిగా అన్యాయం చేయడమే అవుతుందన్నారు.