- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శుభవార్త చెప్పిన రాష్ట్ర మంత్రి.. మీ అకౌంట్లలో నగదు జమ చేశారంట
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాన్ని పండుగ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి అండగా ఉంటూ దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు. దేశం మొత్తం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చెప్పాడంటే..చేస్తాడంతే అంటూ ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతుభరోసా, వైఎస్ఆర్ సున్నావడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,197 కోట్లను సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. దీంతో రాష్ట్రంలోని రైతులకు దీపావళి పండుగ ముందే వచ్చినట్లైందన్నారు.
ఈ మూడు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయడం వల్ల వైసీపీ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాలను కేంద్రం ప్రశంసిస్తుందని.. నీతి అయోగ్ మన నుంచి సమాచారం తీసుకుంటూ అభినందనలు తెలిపాయని చెప్పుకొచ్చారు. వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు మన రాష్ట్రంలో పర్యటించి రైతు భరోసా కేంద్రాలను అభినందిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం రైతులకు ఇన్‌పుట్ ఇచ్చే షాప్ మాదిరిగా ఆర్‌బీకేలు ఉండకుండా ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు ఈ కేంద్రాలు తోడుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు 2,197 కోట్లను రైతాంగానికి అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రైతుల తరపున సీఎం వైఎస్ జగన్‌కు మంత్రి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు.