యువతి డ్రెస్ మార్చుకుంటుండగా వీడియోలు తీసిన యువకులు

by Sumithra |   ( Updated:2021-11-05 08:56:06.0  )
Young boys
X

దిశ, బంజారాహిల్స్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బట్టలు కొనడానికి వచ్చిన యువతి ట్రయల్ రూమ్‌లో డ్రెస్ మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియోలు తీశారు. వెంటనే బయటకు వచ్చిన యువతి సదరు యువకులను చూసి, తనను వీడియోలు తీస్తున్నట్లు గుర్తించి మేనేజర్‌కు అప్పగించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వీడియోలు తీసిన కిరీట్ అసాట్(24), గౌరవ్ కల్యాణ్ (19)లతో పాటు భద్రతా చర్యలు పాటించని మేనేజర్‌ను అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. అనంతరం యువకులపై కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కి తరలించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10/36లోని ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ H&M షో రూంలో చోటుచేసుకుంది.

యువకుడికి సాయంత్రం అంత్యక్రియలు.. రాత్రి ఇంటికి..

Advertisement

Next Story