- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీటీడీపై హీరో సూర్య తండ్రి ఆరోపణలు.. కేసు నమోదు
తమిళ అగ్ర నటుడు సూర్య తండ్రి శివకుమార్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షాకిచ్చింది. ఏడుకొండలవాడు కొలువైన తిరుమల సన్నిధానంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో డబ్బులున్నవారికే దర్శనాలు కల్పిస్తారని.. గెస్ట్‌హౌస్‌లు సైతం వారికే ఇస్తారని శివకుమార్ ఆరోపించారు. అంతటితో ఆగని ఆయన.. సామాన్యులకు దర్శనం కల్పించకుండా తోసేస్తారని కూడా వ్యాఖ్యానించారు. అసలు టీటీడీ లాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలి..? అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ శనివారం సాయంత్రం శివకుమార్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇలా టీటీడీపై దుష్ప్రచారం చేసే వారి భరతం పట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో హీరో సూర్య తండ్రి శివకుమార్ కూడా ఉండటం గమనార్హం. ఈ 8 మంది తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, తిరుమలకు వెళ్లొద్దంటూ ఆరోపణలు చేసినవారే. కాగా తమిళ మయ్యన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు వ్యవహారంపై ఇంతవరకు సూర్య గానీ.. శివకుమార్ గానీ స్పందించలేదు.