- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈసారి ఐపీఎల్ వద్దంటూ కోర్టులో పిటిషన్
కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విమాన సర్వీసులు సైతం రద్దు అవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ దేశానికి విమాన సర్వీసులు పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడీ వైరస్ ప్రభావం మన దేశంలో నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నీ ఐపీఎల్‌పై కూడా పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్‌ను నిర్వహించొద్దని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించడానికి బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దని కోరుతూ మద్రాసు హైకోర్టులో లాయర్ అలెక్స్ పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వేల సంఖ్యలో వివిధ దేశాల నుంచి క్రీడాభిమానులు వస్తారు. వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందితే దేశం మొత్తం వ్యాపించి అంతా అతలాకుతలం అవుతుందని పేర్కొన్నారు. ఐపీఎల్ లీగ్‌ను వాయిదా వేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ టోర్నీకి వ్యతిరేకంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ మార్చి 29న ముంబయి ఇండియన్స్‌తో చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడనుంది. కాగా న్యాయవాది వేసిన పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
tags :Case against IPL, mumbai high court, coronavirus, march 19, Petition of Lawyers Alex