- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ పెద్దాస్పత్రిలో బిగ్‌బాసు దయవల్లే కరోనా వ్యాప్తి
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణాలోని రెండు జిల్లాలకు పెద్దదిక్కుగా ఉండే కరీంనగర్ సర్కారు ఆస్పత్రిలో ఒకరిద్దరు బాసులు వ్యవహరిస్తున్న తీరు వల్ల తీరని నష్టం వాటిల్లుతోందన్న ప్రచారం జరుగుతోంది. కరోనా మహమ్మారి విషయంలో ఈ ఆస్పత్రిలో తీసుకుంటున్న చర్యల వల్ల సిబ్బంది కూడా అస్వస్థకు గురయ్యారని సమాచారం. వివరాల్లోకివెళితే.. దాదాపు 15 రోజుల కిందట కరోనా లక్షణాలతో ఓ పెద్దావిడ సివిల్ ఆస్పత్రిలో చేరితే ఆమెకు చికిత్స అందించేందుకు ట్రామా డిపార్ట్ మెంట్‌లోని ఐసీయూలో ఉంచి వైద్య సేవలందించారు.
అక్కడి వైద్య సేవలందించే సిబ్బంది అందుకు నిరాకరించినా ఆ పెద్దాఫీసర్ తన అధికారంతో కన్నెర్ర చేయడంతో వారు కిమ్మనలేకపోయారు. అసలే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో ఆ పెద్దావిడకు వైద్యం అందించిన కొంతమందికి కరోనా వ్యాప్తి జరిగింది. వారంతా కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే, కరోనా బారిన పడ్డ ఉద్యోగుల నుంచి వారి కుటుంబ సభ్యులకు కూడా సోకడంతో ఆయా కుటుంబాలకు చెందిన 15 మంది బాధితులుగా మారిపోయారు.
వాస్తవానికి కొవిడ్-19 వ్యాప్తి చెందే క్రమంలో ప్రత్యేకంగా వైద్య సేవలందించేదుకు సివిల్ ఆస్పత్రిలో స్పెషల్ డిపార్ట్ మెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సారే. ఐసీయూ, ఏఎమ్ సి, ఐసోలేషన్ వార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
కరోనా లక్షణాలు ఉన్నవారిని వారి స్థాయిని బట్టి ఈ వార్డుల్లోనే జాయిన్ చేయాల్సి ఉన్నప్పటికీ, సాధారణ రోగులకు చికిత్స అందించాల్సిన వార్డుల్లో జాయిన్ చేయడం వల్లే ఇంతమందికి కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. మరికొంత మంది అనుమానిత కేసులను కూడా కామన్ ట్రీట్‌మెంట్ ఇచ్చే వార్డుల్లోనే ‘పెద్దల’ నుంచి ఫోన్ వచ్చిందన్న సాకుతో జాయిన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో కరీంనగర్ సివిల్ ఆస్పత్రి కేంద్రంగానే కరోనా విస్తరిస్తోందన్న భయం మొదలైంది. ప్రధానంగా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బయటకు చెప్పలేక, తమకు అంటుకున్న వైరస్ ఎలా తగ్గించుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నఅభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.