- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నెగెటివ్..డీఎస్పీ అలీ డిశ్చార్జి
దిశ, ఖమ్మం : కరోనా పాజిటివ్‌తో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్తగూడెం డీఎస్పీ అలీ గురువారం రాత్రి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. అయితే మరి కొన్ని రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని గాంధీ వైద్యులు సూచించారు. వివరాల్లోకి వెళితే .. కరోనా పాజిటివ్ తేలడంతో 15రోజులుగా గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న అలీ ఆరోగ్యం కుదుటపడింది. మరల పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన్ను వైద్యలు ఇంటికి పంపించారు. 3రోజుల కిందట ఆయన కొడుకు కూడా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక డీఎస్పీ అలీ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న మహిళకు పూర్తిగా నయం కాకపోవడంతో ఆమె ఇంకా క్వారంటైన్లో కొనసాగుతోంది. డీఎస్పీతో పాటు ఆయన కుమారుడు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలని వైద్య అధికారులు ఆదేశించారు. తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పినట్టు తెలుస్తోంది.
Tags: carona, lockdown, dsp ali discharge, gandhi,kammam