- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
6,515కు చేరిన కరోనా మృతులు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందినవారి సంఖ్య ఇప్పటివరకు 6,515కు చేరుకోగా, 169,415మంది ఈ వైరస్‌తో ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. భారత్ విషయానికొస్తే.. 112మంది మందికి కరోనా సోకగా, వీరిలో ఇద్దరు మృతిచెందారు. దేశాలవారీగా చూసుకున్నట్టయితే, కోవిడ్ జన్మస్థలమైన చైనాలో అత్యధికంగా 80,858మందికి ఈ వైరస్ సోకగా, 3,213మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 24,747కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1,809మంది మృతిచెందారు. ఇరాన్‌లో 13,938కేసులు నమోదవ్వగా, 724మరణాలు సంభవించాయి. తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా(8,162-75), స్పెయిన్ (7,845-292), జర్మనీ(5,813-11), ఫ్రాన్స్ (5,423-127) తదితర దేశాలు ఉన్నాయి. అయితే, సంతోషించదగ్గ విషయమేమిటంటే, ఈ వైరస్ సోకినవారిలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 77,436మంది కోలుకున్నారు. భారత్‌లో 13మంది క్యూర్ అయ్యారు.