- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Yantra India Ltd Jobs: యంత్ర ఇండియాలో జాబ్స్.. కేవలం పదో తరగతి/ఐటిఐ అర్హత ఉంటే చాలు
దిశ,వెబ్‌డెస్క్: మీరు పదో తరగతి/ఐటిఐ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకోసం ప్రభుత్వ రంగ సంస్థ 'యంత్ర ఇండియా లిమిటెడ్(Yantra India Ltd)' గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 3883 ట్రేడ్ అప్రెంటీస్(Trade Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://recruit-gov.com ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 21 నవంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- ఐటిఐ(ITI) - 2498 పోస్టులు
- నాన్-ఐటిఐ(Non-ITI) - 1385 పోస్టులు
విద్యార్హత:
పోస్టును బట్టి 50 శాతం మార్కులతో పదో తరగతి/ఐటిఐ పూర్తి చేసి ఉండాలి
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 14-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
పదో తరగతి/ఐటిఐలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 200+జీఎస్టీ.. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/మహిళలకు రూ. 100+జీఎస్టీ ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6000 నుంచి రూ. 7,000 వరకు స్టైఫండ్ ఉంటుంది.