కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వేతనం ఎంతో తెలుసా..

by Sumithra |
కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వేతనం ఎంతో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : నిరుద్యోగులకు విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ శుభవార్త తెలిపింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీసీబీఎల్‌ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 28 నాటికి ఆన్‌లైన్‌ లో అప్లయ్‌ చేసుకోవాలి.

ముఖ్య తేదీలు..

దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 28, 2024 వరకు.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 2024.

పూర్తి వివరాల కోసం : https://www.vcbl.in/ వెబ్‌సైట్‌ ను సంప్రదించాలి.

ముఖ్యసమాచారం..

ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు : 30

వేతనం : నెలకు రూ.20,330 నుంచి రూ.45,590

విద్యార్హత : డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం

వయోపరిమితి : 20 నుంచి 30 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు : రూ.1,000

ఎంపిక ప్రక్రియ : ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా

పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్‌, కర్నూలు, వైజాగ్‌, విజయవాడ, కాకినాడ, తిరుపతి కేంద్రాలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story