- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CUET UG 2024 అప్లికేషన్ కు చివరి తేది ఎప్పుడంటే ..
దిశ, ఫీచర్స్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 26న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్- UG 2024 అప్లికేషన్ విండోను క్లోస్ చేయనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని NTA ప్రకటించింది. NTA అధికారిక వెబ్‌సైట్ Exams.nta.ac.in/CUET-UG/ని సందర్శించి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసిన తర్వాత నమోదిత అభ్యర్థులు కూడా తమ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు సవరణలు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI ద్వారా డిపాజిట్ చేయవచ్చు. NTA ఏప్రిల్ 30న CUET UG 2024 పరీక్ష నగర స్లిప్‌ను విడుదల చేయనుంది. NTA అధికారిక నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు మార్చి 28 నుంచి మార్చి 29, 2024 వరకు (రాత్రి 11:50 గంటల వరకు) వివరాలలో సవరణలు చేయవచ్చు.
CUET UG 2024 అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ..
CUET UG 2024 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ మే రెండో వారంలో విడుదల చేయనున్నారు. హాల్ టికెట్ విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా NTA నియమించిన కేంద్రాల్లో మే 25, మే 31 మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 30న ఫలితాలు వెలువడవచ్చు. హిందీ, ఇంగ్లిష్‌తో కలిపి మొత్తం 13 భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
దరఖాస్తు రుసుము..
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఒక్కో సబ్జెక్టుకు రూ.400, 3 సబ్జెక్టుల వరకు రూ.1000 గా దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. SC/ST/PWBD/థర్డ్ జెండర్ ప్రతి సబ్జెక్టుకు రూ.350, 3 సబ్జెక్టుల వరకు రూ.800 చెల్లించాలి. ఈసారి 250కి పైగా యూనివర్శిటీల్లో యూజీ ప్రోగ్రామ్స్‌లో సీయూఈటీ యూజీ స్కోర్ ద్వారా ప్రవేశాలు జరగనున్నాయి.
అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారమ్‌లను పూరించడానికి అనుమతి లేదని తెలిపారు. ఈసారి పరీక్షలోనూ పలు మార్పులు జరగనున్నాయి. ఈసారి అభ్యర్థులు 10 పరీక్ష పేపర్లకు బదులుగా 6 పరీక్ష పేపర్లను మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.