SSC Stenographer: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డులు రిలీజ్..!

by Maddikunta Saikiran |
SSC Stenographer: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డులు రిలీజ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ(Central Govt) శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్(Stenographer) ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత జులై నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్(గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డీ (గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు డిసెంబర్‌ 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ నియామక పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డుల(Admit Cards)ను ఎస్‌ఎస్‌సీ తాజాగా విడుదల చేసింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/login ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్(Registration No), పాస్ వర్డ్(Password) వివరాలు ఎంటర్ చేసి ఎగ్జామ్ సెంటర్(Exam Centre) డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT), స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్(Skill Test) ఆధారంగా స్టెనోగ్రాఫర్ పోస్టులకు సెలెక్ట్ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed