రికార్డు స్థాయిలో నీట్ యూజీ అప్లికేషన్స్.. అబ్బాయిల కంటే అమ్మాయిల దరఖాస్తులే ఎక్కువ..

by Sumithra |
రికార్డు స్థాయిలో నీట్ యూజీ అప్లికేషన్స్.. అబ్బాయిల కంటే అమ్మాయిల దరఖాస్తులే ఎక్కువ..
X

దిశ, ఫీచర్స్ : ఈసారి NEET UG 2024 కోసం రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ నమోదు చేసుకున్నారు. NEET UG 2024 కోసం నమోదు ప్రక్రియ మార్చి 16 వరకు కొనసాగింది. దేశవ్యాప్తంగా మే 5న పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరు కావడానికి 23 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్ ఫారాలు వచ్చాయి. ఈసారి ఎంత మంది అబ్బాయిలు, అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకుందాం.

ఈసారి మొత్తం 23,81,833 మంది అభ్యర్థులు NEET UG 2024 కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 10 లక్షలకు పైగా బాలురు, 13 లక్షలకు పైగా బాలికలు ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 10 లక్షలకు పైగా OBC NCL కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 6 లక్షల మంది, ఎస్సీ కేటగిరీకి చెందిన 3.5 లక్షలు, జనరల్ - ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన 1.8 లక్షలు, ఎస్టీ కేటగిరీకి చెందిన 1.5 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష తేదీ మారదు..

NEET UG 2024 మే 5న నిర్వహించనున్నారు. ఈ పరీక్షను నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. లోక్‌సభ ఎన్నికల తేదీ కారణంగా పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష నిర్ణీత తేదీన మాత్రమే నిర్వహించనున్నారు.

ఏ రాష్ట్రం నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ?

యూపీ నుంచి 3,39,125 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి 27,9904 మంది, రాజస్థాన్‌ నుంచి 1,96,139 మంది, తమిళనాడు నుంచి 15,5216 మంది అభ్యర్థులు నీట్‌ యూజీ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

గతేడాది గణాంకాలు..

గతేడాది నీట్ యూజీకి మొత్తం 20,87,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మే 7న పరీక్ష నిర్వహించారు. మొత్తం 97.7 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. భారతదేశం, విదేశాల్లోని 499 నగరాల్లోని 4097 కేంద్రాలలో పరీక్ష జరిగింది. 2022లో మొత్తం 18 లక్షల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.

NEET UG 2024 అడ్మిట్ కార్డ్..

NEET UG 2024 కోసం అడ్మిట్ కార్డ్ నిర్ణీత సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా విడుదల చేస్తుంది. హాల్ టికెట్ విడుదలైన తర్వాత, నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed