- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MBBS మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల
by Hamsa |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహించగా రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 77.00 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 127 మంది డిస్టింక్షన్ రాగ 2240 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. మిగిలిన 1767 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మొత్తం 5369 మంది విద్యార్థులు హాజరు కాగా 4134 ఉత్తీర్ణత సాధించారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వై మల్లేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడచ్చని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
Advertisement
Next Story