- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంట్రల్ బ్యాంక్‌లో 1000 మేనేజర్ పోస్టులు
దిశ,వెబ్‌డెస్క్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్..మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరిలో మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ - 2 మేనేజర్ పోస్టులు భర్తీచేయనుంది. అర్హులైన అభ్యర్థులు జులై 15లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.
పోస్టుల వివరాలు:
మేనేజర్ - మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ - 2 : 1000 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ, సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎస్‌బీ/ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ /ఆర్ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం. లేదా పీఎస్‌బీ/ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ఆర్ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంసీఏ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: మే 5, 2023 నాటికి 32 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 48,170 నుంచి రూ. 69,810 ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయాలి.
దరఖాస్తు: రూ. 850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ. 175 ఉంటుంది.
చివరితేదీ: జులై 15, 2023.
వివరాలకు వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in/