EXIM బ్యాంక్ లో ఉద్యోగాలు, త్వరపడండి

by Web Desk |
EXIM బ్యాంక్ లో ఉద్యోగాలు, త్వరపడండి
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎక్స్ పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(EXIMBANK)లో మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 25

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 14

*విద్యార్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఏ(ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌) పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 సెప్టెంబర్ 30 నాటికి 25 ఏళ్ల వయస్సు మించకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*పరీక్షను అబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. 0.25 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.eximbankindia.in/​​​​​​​ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed