- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ITBP Jobs: ఐటీబీపీలో 545 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్:పదో తరగతి పూర్తి చేసి జాబ్ లేక ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారా..అయితే మీకోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP) శుభవార్త చెప్పింది. ఐటీబీపీలో కానిస్టేబుల్(Driver) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 545 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 77 పోస్టులు. ఎస్టీ కేటగిరీలో 40 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 164 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 55 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు http://recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 6 నవంబర్ 2024.
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్(Driver)
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఇవ్వనున్నారు