ఉచిత విద్య, వసతితోపాటు ఫ్రీ ఐఐటీ, నీట్ కోచింగ్

by Seetharam |
ఉచిత విద్య, వసతితోపాటు ఫ్రీ ఐఐటీ, నీట్ కోచింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ . 2023- 24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 గిరిజన గురుకుల జానియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్య, వసతితోపాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.

వివరాలు:

టీటీడబ్ల్యఆర్‌జేసీ /టీటీడబ్ల్యూయూఆర్‌జేసీలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, వృత్తి విద్యాకోర్సులు.

మీడియం: ఇంగ్లిష్‌లో బోధిస్తారు.

అర్హత: మార్చి 2023లో పదో తరగతి ఉత్తీ్ర్ణులై ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు (పట్టణాల్లో) రూ. 1,50,000 (గ్రామాల్లో) మించరాదు.

ఎంపిక: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 100 చెల్లించాలి.

అప్లికేషన్ : ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరితేదీ: జూన్ 15, 2023.

వెబ్‌సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in/

Advertisement

Next Story

Most Viewed