IIM Jammu: ఐఐఎం జమ్మూలో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!

by Geesa Chandu |   ( Updated:2024-09-17 10:24:12.0  )
IIM Jammu: ఐఐఎం జమ్మూలో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జమ్మూ(Indian Institute of Management Jammu)..లో ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 16

  • ఆపరేటర్-07
  • ఐటీ టెక్నీషియన్-02
  • ఐటీ ఇంజినీర్-01
  • నెట్వర్క్ ఇంజినీర్-01
  • అకౌంట్ అసిస్టెంట్-02
  • ఎగ్జిక్యూటివ్- 02
  • ఆడియో-వీడియో టెక్నీషియన్-01

విభాగాలు: ఏసీ/రిఫ్రిజిరెంట్, చిల్లర్/బాయిలర్, ఎస్ టీపీ, ఆర్ఓ/ డబ్ల్యూటీపీ, ఫైర్ అలారమ్ తదితర విభాగాలు.

అర్హత: ఇంటర్మీడియెట్, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం(Work Experience) ఉండాలి.

వయసు: ఆడియో-వీడియో టెక్నీషియన్ పోస్టుకు 38 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు రూ.590; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295.

ఎంపిక: విద్యార్హత, పని అనుభవం,, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆఫ్ లైన్ దరఖాస్తులను బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, బీఈసీఐఎల్ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2024.

వెబ్ సైట్: https://www.becil.com/

Advertisement

Next Story

Most Viewed