- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఇంటర్ విద్యార్హతతో నెలకు రూ.92,300 జీతంతో ఉద్యోగాలు
దిశ, ఫీచర్స్: ఇంటర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. తాజాగా బీఎస్ఎఫ్(BSF) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో(CRPF) ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ (క్లర్క్) ఖాళీల భర్తీకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించిన వయస్సు, విద్యార్హత, జీతం వంటి మొదలైన విషయాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పోస్టులు : ఏఎస్సై (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
మొత్తం పోస్టుల సంఖ్య: 1,526
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే పురుష/మహిళా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://rectt.bsf.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 09-06-2024
చివరి తేది: 08-07-2024
విద్యార్హతలు:
పోస్టులను బట్టి 12వ తరగతి/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు.. టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్, నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
పరీక్ష ఫీజు:
ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ వారికి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.
జీతం:
ఏఎస్సై: 29,200 - 92,300
హెడ్ కానిస్టేబుల్: 25,500 - 81,100