నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

by Anjali |
నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీలోని రాజమహేంద్రవరంలోని ఐకార్, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్సిట్యూట్ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ జాబ్స్ భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిగ్రీ, సైన్స్/ఇంజినీరింగ్ విభాగంలో ఎంఈ/ఎంటెక్, బయోకెమిస్ట్రీలో డిగ్రీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్ తో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.

శాలరీ: యంగ్ ప్రొఫెషనల్ I ఉద్యోగాలకు ఎంపికైతే 30, 000 జీతం ఉంటుంది. యంగ్ ప్రొఫెషనల్ II పోస్టులకు సెలక్ట్ అయితే 42, 000 జీతం పొందవచ్చు.

అప్లికేషన్ ప్రాసెస్: ఆఫ్ లైన్ దరఖాస్తులను డైరెక్టర్, ఐసీఏఆర్-సీటీఆర్ఐ, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు డైరెక్టుగా గాని పోస్టు ద్వారా గాని పంపించాలి.

Advertisement

Next Story