ESIC Jobs: ఈఎస్ఐసీ ఢిల్లీలో... భారీ వేతనాలతో కొలువులు!

by Geesa Chandu |
ESIC Jobs: ఈఎస్ఐసీ ఢిల్లీలో... భారీ వేతనాలతో కొలువులు!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) లో ఒప్పంద ప్రాతిపదికన కొలువుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 22

  • యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ - 15
  • కన్సల్టెంట్ గ్రేడ్-1, 2 - 05
  • సీనియర్ కన్సల్టెంట్ - 02

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీటెక్ (ఐటీ), ఎంబీఏ/ఎంసీఏ/ఎంటెక్ (ఫైనాన్స్), పీజితో పాటు వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి.

వయసు: 32 నుంచి 62 ఏళ్లు మించకూడదు.ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ కు రూ.70,000; కన్సల్టెంట్ గ్రేడ్-1 పోస్టుకు రూ.80,000 నుంచి రూ.1,45,000; కన్సల్టెంట్ గ్రేడ్- 2 పోస్టుకు రూ.1,45,000 నుంచి రూ.2,65,000; సీనియర్ కన్సల్టెంట్ పోస్టుకు నెలకు రూ.2,65,000 నుంచి రూ.3,30,000.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-09-2024

వెబ్ సైట్: https://esic.gov.in/

Advertisement

Next Story