మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి శవం

by Kalyani |
మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి శవం
X

దిశ, కొల్చారం: మంజీరా నదిలో పోతంశెట్టి పల్లి శివారులో గుర్తు తెలియని వ్యక్తి శవం శనివారం లభించింది. గ్రామస్తులు, కొల్చారం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ నుంచి ఏడుపాయలకు వెళ్లేదారిలో మొదటి బ్రిడ్జి సమీపంలో సుమారు 44 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి శవం మంజీరా నది నీటి మడుగులో లభించింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు కొల్చారం ఏఎస్ఐ తారా సింగ్ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎరుపు రంగు బనీన్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు ఏఎస్ఐ తెలిపారు. పోతంశెట్టిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుంధతి ఫిర్యాదు మేరకు ఏ ఎస్ ఐ తార సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed