- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్లైన్ గేమ్ పేరుతో ఘరానా మోసం..
దిశ, గోదావరిఖని : ఆన్లైన్ గేమ్ పేరుతో ఓ గవెర్నమెంట్ ఉద్యోగిని ఏకంగా రూ.1,36,96,290 మోసపోయిన సంఘటన రామగుండంలో చోటుచేసుకుంది. మోసపోయిన ఉద్యోగి రామగుండం సైబర్ క్రైమ్ లో కేసు పెట్టగా వేగవంతంగా విచారణ చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ DSP యం.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు మహమ్మద్ అబ్దుల్ నయీం ను మంచిర్యాల బస్టాండ్ లో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే మహమ్మద్ అబ్దుల్ నయీం పెద్దపల్లి జిల్లా రామగుండం వాసి అని తెలిపారు. ఇతను DAFABET App ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పి తనకు ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ వస్తాయని నమ్మించి బాధితుల వద్ద నుంచి తరచూ డబ్బులు వేయించుకొని వాటిని అతని అవసరాల కోసం వాడుకున్నారని తెలిపారు.
అంతే కాకుండా షేర్ మార్కెట్ లో కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని నమ్మ బలికాడని చెప్పి డబ్బులు తీసుకున్నారని వెల్లడించారు. ఆ నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారని సైబర్ క్రైమ్ పోలీస్ వివరించారు. మోసపోయిన వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రాగా డీజీ షికా గోయల్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ ఆదేశాల మేరకు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ పోలీసులు మోసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇలాంటి మాయమాటలను నమ్మి ఎవరు మోసపోకూడదని, ఆన్లైన్ గేమ్ లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.