కరెంట్ అఫైర్స్ లేటెస్ట్: 26 జనవరి 2023

by Hajipasha |
కరెంట్ అఫైర్స్ లేటెస్ట్: 26 జనవరి 2023
X

ఉత్తమ విమానాశ్రయంగా కోయంబత్తూర్:

ప్రపంచంలోనే అత్యుత్తమ సమయ పాలన పాటించిన 20 విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో రూపొందించిన జాబితాలో కోయంబత్తూర్, ఇండిగో చోటు సాధించాయి. 2022 కు సంబంధించి విమానయాన రంగ విశ్లేషణ సంస్థ ఓఏజీ రూపొందించిన నివేదికలో.. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు 5వ స్థానం లభించింది. ప్రభుత్వ రంగంలోని కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ 13వ స్థానం దక్కించుకున్నాయి. ఇండిగో ఆన్‌టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) 83.51 శాతంగా నమోదైంది.

2019లో 77.38 శాతంతో ఈ సంస్థ 54 వ స్థానంలో ఉంది.

కృష్ణపట్నం పోర్టుకు అవార్డు:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టుకు గ్రీన్ టెక్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఈహెచ్ఎస్ 2023 అవార్డు లభించింది. గోవాలో జరిగిన గ్రీన్‌టెక్ ఫౌండేషన్ సదస్సులో పోర్టు ఎన్విరాన్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి.జ్యోతి, ఈహెచ్ఎస్ అసోసియేట్ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఎన్‌డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న కుమార్‌కు రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదుగా రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాన్ని జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) కమాండెంట్ వి.వి.ఎన్ ప్రసన్న కుమార్ అందుకున్నారు. ఎన్‌డీఆర్ఎఫ్ రైజింగ్ డేను పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అత్యున్నత సేవలందించిన పలువురికి గత ఏడాది గణతంత్ర దినం సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలను ప్రకటించారు.

Advertisement

Next Story