కరెంట్ అఫైర్స్.. వర్షిణికి ఫిడే మాస్టర్ టైటిల్

by samatah |   ( Updated:2023-02-11 13:58:50.0  )
కరెంట్ అఫైర్స్..  వర్షిణికి ఫిడే మాస్టర్ టైటిల్
X

ఏపీకి చెందిన ఎం.సాహితీ వర్షిణి ఫిడే మాస్టర్ టైటిల్ కైవనం చేసుకుంది. ఇప్పటి వరకు ఉమన్ క్యాండిడేట్ మాస్టర్, ఉమన్ ఫిడే మాస్టర్, ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్స్ సాధించిన సాహితి వర్షిణి తాజాగా ఫిడే మాస్టర్ అయింది. ఏడాదిగా వివిధ టోర్నీల్లో ఆమె నిలకడగా రాణిస్తోంది. వర్షిణి ఇప్పటివరకు తొమ్మిది అంతర్జాతీయ పతకాలు సాధించింది.

ఖేలో ఇండియా క్రీడల్లో తెలంగాణకు 5 పతకాలు:

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తెలంగాణ పతక జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ స్కల్ విభాగంలో హేమలత రజత పతకం సాధించింది. పురుషుల క్వాడ్రాపుల్ స్కల్ ఈశెంట్ లో జ్ఞానేశ్వర్, గణేశ్, సాయి వరుణ్, శ్రవణ్ కుమార్ తో కూడిన రాష్ట్ర టీమ్ కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల స్కల్ కేటగిరిలో అనురాధ, ఉదయభాను మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు ఫఎన్సింగ్‌లో రజతం, కాంస్యం దక్కాయి.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో సూర్య:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతేడాది నంబర్ వన్ అయినప్పటి నుంచి సూర్య తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ సాగుతున్నాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 906 రేటింగ్ పాయింట్లున్నాయి. ఇటీవలే టీ20 స్థానం సంపాదించిన శుభ్‌మన్ గిల్ 30వ స్థానానికి ఎగబాకాడు.


దేశంలో తొలిసారి లిథియం నిల్వలు గుర్తింపు:

భారత్ లో తొలిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) గుర్తించినట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. జమ్ము కశ్మీర్ లోని రియాసి జిల్లాలో గల సలాల్ హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు దొరికడం చాలా ఉపయోగకరం అని గనులశాఖ తెలిపింది. గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్లు వెల్లడించింది.

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణ సాయం:

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) రుణసాయం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఓ దశలో సంక్లిష్టంగా మారిన ఇరు పక్షాల చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. దీంతో పాక్ కష్టాలు గట్టెక్కి ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడేలా రూ. 8,250 కోట్ల (ఒక బిలియన్ డాలర్లు) రుణ సాయం ఆ దేశానికి అందనుంది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తో సమావేశమైన వర్గాల కథనం మేరకు ఇరు పక్షాలు రుణ షరతులపై ఓ అవగాహనకు రావడంతో ఈ ఒప్పందాన్ని ప్రధాని వెంటనే ఆమోదించారు.

Advertisement

Next Story

Most Viewed