CUET(UG)-2024:దరఖాస్తు గడువు పెంపు..చివరి తేదీ ఇదే?

by Jakkula Mamatha |
CUET(UG)-2024:దరఖాస్తు గడువు పెంపు..చివరి తేదీ ఇదే?
X

దిశ,వెబ్ డెస్క్:దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు,ఇతర సంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే CUET-UG -2024 దరఖాస్తు గడువు నోటిఫికేషన్ లో మార్చి 26వ తేదీ లాస్ట్ డేట్ కాగా దాన్ని తాజాగా మార్చి 31 రాత్రి 10 గంటల వరకు పొడిగించిన విషయం తెలిసిందే.ఈరోజు గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో ఐదు రోజుల అప్లికేషన్ గడువు పొడిగించారు.ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తాజాగా NTA ప్రకటించింది.తెలుగు సహా 13 భాషల్లో మే 15వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య ఈ పరీక్షను ఆన్లైన్ /ఆఫ్లైన్ లో విధానంలో నిర్వహిస్తారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు NTA అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు.

ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానం..

అధికారిక వెబ్‌సైట్‌:exams.nta.ac.in/CUET-UG/కి వెళ్లండి.

రిజిస్ట్రేషన్: హోమ్‌పేజీలో రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి: ఇక్కడ అవసరమైన వివరాలు నమోదు చేయండి.

పరీక్ష ఫీజు:జనరల్ కేటగిరీ వారికి ఒక్కో సబ్జెక్టుకు రూ.400, మూడు సబ్జెక్టులకు రూ.1000.

OBC (NCL)/EWS కేటగిరీకి ఒక్కో సబ్జెక్టుకు రూ. 375, మూడు సబ్జెక్టుల వరకు రూ.900.

Advertisement

Next Story

Most Viewed