మార్చి 11 నుంచి CUET PG 2024 పరీక్షలు.. ఎంతమంది హాజరవుతున్నారంటే..

by Sumithra |
మార్చి 11 నుంచి CUET PG 2024 పరీక్షలు.. ఎంతమంది హాజరవుతున్నారంటే..
X

దిశ, ఫీచర్స్ : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ PG 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 11, 2024 నుండి మార్చి 28 వరకు నిర్వహించనుంది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను ఎన్‌టీఏ ఇప్పటికే విడుదల చేసింది. ఇంకా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgcuet.samarth.ac.inని లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. NTA పరీక్ష కోసం మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. వీటిని అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం, పరీక్ష మూడు షిఫ్టులలో నిర్వహించనున్నారు. మొదటి షిప్టులో ఉదయం 9 గంటల నుంచి 10.45 గంటల వరకు, రెండో షిప్టులో మధ్యాహ్నం 12.45 నుంచి 2.30 గంటల వరకు, మూడో షిప్టులో సాయంత్రం 4.30 నుంచి 6.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం 30 నిమిషాల ముందు తమ కేంద్రాలకు చేరుకోవాలి.

వీటిని తీసుకెళ్లడం తప్పనిసరి..

CUET PG అడ్మిట్ కార్డ్, సిటీ స్లిప్ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.

CUET PG అడ్మిట్ కార్డ్ హార్డ్ కాపీని తీసుకెళ్లాలి.

బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లవచ్చు.

అదనపు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా తీసుకెళ్లాలి.

ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ID వంటి అధికారిక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.

పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

మొబైల్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, మైక్రోఫోన్లు, పేజర్లు తీసుకెళ్లడం నిషేధం.

కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, కెమెరా, టేప్ రికార్డర్ కూడా నిషేధించారు.

పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. బయోమెట్రిక్ నమోదు, అడ్మిట్ కార్డ్, సంతకం, ఫోటో సరిపోలిక తర్వాత మాత్రమే సెంటర్‌లోకి ప్రవేశం ఇవ్వనున్నారు. అధికారిక నోటీసు ప్రకారం అభ్యర్థులు లాగిన్, పరీక్ష ప్రారంభానికి ముందు సూచనలను చదవడానికి 10 నిమిషాల సమయం ఇస్తారు.

Advertisement

Next Story