CBSE Result: సీబీఎస్ఈ ఫ‌లితాల్లో సౌత్ టాప్.. అమ్మాయిల‌దే హ‌వా

by Ramesh N |
CBSE Result: సీబీఎస్ఈ ఫ‌లితాల్లో సౌత్ టాప్.. అమ్మాయిల‌దే హ‌వా
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. cbseresults.nic.inలో స్కోరు చూసుకోవచ్చు. ఈ వెబ్ ఓపెన్ చేసి అందులో రోల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేస్తే ఫలితాలు వస్తాయని బోర్డు పేర్కొంది. సీబీఎస్ఈ పదో తరగతిలో 93.60 శాతం మంది విద్యార్థులు పాసైయ్యారు. తిరువనంతపురంలో అత్యధికంగా 99.75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజయవాడ 99.75 శాతం, చెన్నై 99.30 శాతం, బెంగళూరు 99. 26 శాతం, అజ్మీర్ 97.10 శాతంలో ఉంది. ఇందులో బాలికలే పై చేయి సాధించారు.

12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం విద్యార్థులు పాసైయ్యారు. ఇందులోనూ బాలికలేపై చేయి సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 91.52 శాతం మంది అమ్మాయిలు, 85.12 శాతం మంది బాలురు ఉన్నారు. తిరువనంతపురంలో అత్యధికంగా 99.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజయవాడలో 99.04, చెన్నై 98.47, బెంగళూరులో 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తరాది కంటే దక్షిణాది సీబీఎస్ఈ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.

Advertisement

Next Story

Most Viewed