- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిలటరీ నర్సింగ్ సర్వీసెస్‌లో జాయిన్ అవుతారా.. ప్రవేశాలు ఎలాగంటే ?
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐదు నర్సింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్ఎంఎస్) కింద ప్రారంభమయ్యే నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు :
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ (ఫిమేల్) - 220 సీట్లు.
సీట్ల వివరాలు:
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పుణె - 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కోల్‌కతా -30
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ముంయి - 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లఖ్‌నవూ - 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బెంగళూరు - 40
అర్హత: అవివాహిత/విడాకులు తీసుకున్న/చట్టబద్దంగా విడిపోయిన/వితంతవులైన మహిళా అభ్యర్థులు అర్హులు. 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష 10 +2 (పిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,ఇంగ్లిష్)ఉత్తీర్ణులై ఉండాలి. నీట్ (యూజీ) 2023లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ట ఎత్తు 152 సెం.మీ కలిగి ఉండాలి.
వయసు: అక్టోబర్ 1, 1998 నుంచి సెప్టెంబర్ 30, 2906 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: నీట్ 2023 స్కోరు, జనరల్ ఇంటెలిజెన్స్/జనరల్ ఇంగ్లిష్ సైకలాజికల్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
చివరితేదీ: జులై 4, 2023.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/